Header Banner

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

  Thu Mar 06, 2025 07:00        Politics

(Gas cylinder) గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గ్యాస్ సిలిండర్ వాడే వారికి తీపి కబురు అందించారు. ఇంటింటికి వచ్చి గ్యాస్ డెలివరీ(Gas delivery) చేసే వారికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. డెలివరీ సేవలను మెరుగుపరిచేందుకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి(P.Prasanthi) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి.. సిలిండర్ డెలివరీ, అదనపు ఛార్జీలపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. బుక్ చేసిన 48 గంటల్లోపు ఎల్‌పిజి సిలిండర్లను వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతో గ్యాస్ డీలర్లకు ఆదేశాలు ఇచ్చారు. డోర్ డెలివరీపై అదనపు ఛార్జీలు వసూలు చేయవద్దని స్పష్టం చేశారు. అంతే కాకుండా.. డెలివరీ సమయంలో అధికారికంగా గ్యాస్ ఎజెన్సీ నుంచి తెచ్చిన బిల్లును కూడా ఇవ్వాలన్నారు. అనవసరపు ఛార్జీలు వసూలు చేస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. ‘దీపం 2’ పథకం కింద 408 మంది లబ్ధిదారులకు ఇంకా సబ్సిడీ అందలేదని.. వీరికి త్వరలోనే నగదు జమ చేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

గ్యాస్ డెలివరీ అయిన 48 గంటల్లోపు తమ ఖాతాలను చెక్ చేసుకోవాలన్నారు. గ్యాస్ సబ్సిడీ అమౌంట్ అకౌంట్లో జమ అయ్యాయా.. లేదా అనే విషయాలను ధృవీకరించుకోవాలని సూచించారు. ఏపీలో ఉచితంగా గ్యాస్(Free Gas) సిలిండర్ స్కీమ్ అమలు అవుతున్న విషయం తెలిసిందే. ఉచిత సిలిండర్ కోసం ప్రభుత్వం నిర్దేశించిన సమయాల్లోనే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు గ్యాస్ సబ్సిడీలు రాకపోతే.. దగ్గరి లోని గ్యాస్ ఏజెన్సీలను సంప్రదించి సమస్యను తెలుసుకొని.. పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు. వినియోగదారులను తప్పుదోవ పట్టించే విధంగా అదనపు ఛార్జీలు అని.. డెలివరీ ఛార్జీలు అని వసూలు చేస్తే వారి తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ ఆదేశాలతో గ్యాస్ వినియోగదారులకు పెద్ద ఊరట కలగనుది. ఇకపై టైమ్‌కి సిలిండర్ డెలివరీ, అదనపు ఛార్జీల భారం ఉండబోదు.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations